Home జాతీయం ఎన్‌ఎస్‌జీ కమెండోల తొలగింపు || Removal of NSG Commandos

ఎన్‌ఎస్‌జీ కమెండోల తొలగింపు || Removal of NSG Commandos

0
ఎన్‌ఎస్‌జీ కమెండోల తొలగింపు || Removal of NSG Commandos

 

Nsnnews// నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ వ్యవస్థాపక దినోత్సవం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ సెక్యూరిటీ విధుల నుంచి ఎన్‌ఎస్‌జీ కమెండోల తొలగించాలాని నిర్ణయించారు. ఎన్‌ఎస్‌జీ కమెండోల స్థానంలో సీఆర్‌పీఎఫ్‌ వీఐపీ సెక్యూరిటీ వింగ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 9 మంది నేతలకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, శర్వానంద్‌ సోనోవాల్‌ , కశ్మీర్‌ నేతలు ఫరూక్‌ అబ్దుల్లా, గులాంనబీ ఆజాద్‌, బీఎస్పీ చీఫ్‌ మాయావతి, బీజేపీ కురు వృద్ద నేత ఎల్‌కే అద్వానీకి ఎన్‌ఎస్‌జీ కమెండోల భద్రత ఉంది. అయితే వచ్చే నెల నుంచి ఎన్‌ఎస్‌జీ స్థానంలో వాళ్లకు సీఆర్‌పీఎఫ్‌ సెక్యూరిటీని కల్పిస్తారు. ఇకపై ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్లకు మాత్రమే ఎన్‌ఎస్‌జీ కమెండోలు పరిమితం కానున్నారు. సీఆర్‌పీఎఫ్‌ వీఐపీ సెక్యూరిటీ వింగ్‌ కోసం ఇప్పటికే ప్రత్యేక బెటాలియన్‌కు శిక్షణ కూడా పూర్తి చేశారు. రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌తో పాటు యూపీ సీఎం యోగికి ప్రత్యేక సెక్యూరిటీతో పాటు అడ్వాన్స్‌ సెక్యూరిటీ కూడా ఉంది. వీవీఐపీలు పర్యటించే ప్రాంతాల్లో ముందే ప్రత్యేక టీమ్‌లు పర్యటించి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తాయి. హోంశాఖ మంత్రి అమిత్‌షా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, గాంధీ కుటుంబం లోని ముగ్గురికి సీఆర్‌పీఎఫ్‌ ఇప్పటికే ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది.

2020లోనే సోనియా, రాహుల్‌, ప్రియాంకకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీని తొలగించి సీఆర్‌పీఎఫ్‌ భద్రతను కల్పించారు. అప్పుడే వీఐపీల సెక్యూరిటీ నుంచి ఎన్‌ఎస్‌జీ కమెండోలను తొలగించాలని నిర్ణయించారు. అయోధ్య రామాలయంతో పాటు దక్షిణ భారతంలో ఉన్న ఆలయాల సంరక్షణకు కూడా.. ఎన్‌ఎస్‌జీ కమెండోల రక్షణ కల్పించాలని భావిస్తున్నారు. ఎన్‌ఎస్‌జీ 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. తనకు కేటాయించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లకు, కౌంటర్‌ హైజాకింగ్‌ ఆపరేషన్లకు మాత్రమే NSGని వినయోగించబోతున్నారు. వీఐపీ సెక్యూరిటీ విధుల కారణంగా NSG కమెండోలపై అదనపు భారం పడుతున్నట్టు గుర్తించారు. తొమ్మిది మంది వీఐపీల కోసం దాదాపు 450 మంది బ్లాక్‌ క్యాట్‌ కమెండోలు విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల్లో వాళ్లకు వీఐపీ సెక్యూరిటీ విధుల నుంచి విముక్తి లభించబోతోంది.

Latest news,Telugu news,National news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version