Nsnnews// కామారెడ్డిలోని అమృత గ్రాండ్ హోటల్‌లో, కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో, చేతి వృత్తుల నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. చేతి వృత్తులు చేసే వారిని అభినందిస్తున్నట్టు, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చెప్పారు. ఇంట్లోనే స్వయం ఉపాధి కల్పిస్తున్న, హైదరాబాద్ జౌళి శాఖ బ్రాంచ్ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి శిక్షణ అందించేందుకు తనవంతుగా, అండగా నిలువనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో, హైదరాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు సువర్ణ, సుహిత, జిమార్చిలతో పాటు, వెదురు వస్తువుల తయారీ ఉత్పత్తి దారులు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Kamareddynews, Indhu priya…