Nsnnews// ఉద్యోగాల ఆశ చూపి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు.. విద్యార్థులు, నిరుద్యోగులే బుద్ధి చెబుతారని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు గోబెల్స్ ను మించిపోయిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని… ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రకటన చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 61వేల పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఒక్క పోలీసు శాఖలోనే 30 వేల 731 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. మరో 16 వేల 337 పోస్టుల నియామక పత్రాలు ఇచ్చేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని… వెంటనే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తామే భర్తీ చేసినట్లు గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారని ఆక్షేపించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపారని విమర్శించారు. గ్రూప్ వన్ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆకాంక్షలను కాలరాసిన కాంగ్రెస్ ను తెలంగాణ సమాజం క్షమించదన్నారు.
latestnews, telugunews, telangananews, politicalnews…