Nsnnews// గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ ఉదారత చాటుకుని బాధితురాలు కుటుంబానికి నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేశారు. మంగళవారం గద్వాల సమీపంలోని పిల్లిగుండ్ల కాలనీలో నివాసముంటున్న నిరుపేద బుడగ జంగాల జమ్ములమ్మ గుడిసె అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో మిగిలారు. దీంతో స్పందించిన గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ జమ్ములమ్మ కుటుంబానికి నిత్యావసర సరుకులు దుస్తులు దుప్పట్లు అందజేసి ఉదారత చాటుకున్నారు.
Latest news, Telugu news, Telangana news, Crime news..