Nsnnews// ఉత్తర ఇటలీలో కొన్ని రోజులుగా కురస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఎమిలియా-రొమాగ్నాలో వెయ్యి నివాసాలు ఖాళీ చేయించారు. కుంభవృష్టి కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో రవెన్నా, బోలోగ్నా , ఫాయెంజా ప్రావెన్స్ ల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకిదిగి స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద తీవ్ర రూపం దాల్చడంతో.. స్థానికంగా ఉన్న పలు పాఠశాలలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రైల్వేరాక పోకలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ సహా…అనేక మధ్య, తూర్పు యూరోపియన్ దేశాలు తీవ్రమైన వరదలతో బాధపడుతున్నాయి. చెక్ రిపబ్లిక్, పోలాండ్, రొమేనియాలో వరదల కారణంగా.. ఇప్పటివరకు 20కి పైగా మరణాలు సంభవించాయి.
Latest news,Telugu news,National news