Nsnnews// రాష్ట్రంలో డీఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కేటాయించబోమని.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గ ఉప సంఘం రెండో సమావేశం నిర్వహించారు. డిఫాల్టర్లు బియ్యం మొత్తం త్వరితగతిన ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. డిఫాల్టర్ల విషయంలో కఠిన వైఖరి అవలంభించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఉపసంఘం సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఆన్ లైన్ లో ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news