NSN NEWS//హైదరాబాద్ ఏప్రిల్ 24:ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు.
పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి దృష్టి సారించారు.
ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటు రాకూడదని సక్రమంగా ఏర్పాట్లు చేయా లని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు