NSN NEWS//కరీంనగర్ జిల్లా ఏప్రిల్ 24: కరీంనగర్ జిల్లాగన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ ఆర్ కె పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి (46), అతని కుమారుడు ఓమో జయః చైతన్యానంద (9) తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు డ్యామ్ లోమునిగి మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది.
చాడ రంగారెడ్డి తన ఇద్దరు కుమారులను ఈత నేర్పించడానికి మానేరు డ్యాంకు తీసుకువెళ్లగా పెద్ద కుమా రుడు ఒడ్డు మీద ఉండగా నీటిలోకి దిగిన చిన్న కుమా రుడు తండ్రి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. జాలర్లు ఇరువురి మృత దేహాలను ఒడ్డుకు చేర్చారు.