Nsnnews// పశ్చిమాసియాలో హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థ బలోపేతం కావడంలో ఇరాన్ కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు అదే ఇరాన్ కు చెందిన ఓ గూఢచారి హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా హత్య వెనుక ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నస్రల్లా ఎక్కడున్నారో కచ్చితమైన లొకేషన్ ను ఇరాన్ కు చెందిన ఓ గూఢచారే.. ఇజ్రాయెల్ కు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించాయి. అటు శుక్రవారం బీరుట్ శివార్లలో ఇజ్రాయెల్ దాడులతో ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Latest news,Telugu news,Internation news