ఇకపై వాట్సాప్‌కి సుప్రీంకోర్టు అప్డేట్‌లు
సుప్రీంకోర్టు కేసులకు సంబంధించి ఇకపై వాట్సాప్ ద్వారా అప్డేట్‌లు పొందవచ్చు. పిటీషనర్లు, అడ్వకేట్లు ఇకపై తమ కేసులకు సంబంధించిన అప్డేట్‌లు వాట్సాప్ ద్వారా వ్యక్తిగత మెసేజ్ రూపంలో పొందవచ్చని సీజేఐ చంద్రచూడ్ తాజాగా ప్రకటించారు. ఇలా కేసులకు సంబంధించిన అప్డేట్‌లు వాట్సాప్ ద్వారా సంబంధిత వ్యక్తికి పంపడం న్యాయవ్యవస్థపై మంచి ప్రభావం చూపుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.