Nsnnews// అమరావతి: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా రూ. 14 లక్షలు కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్షించనున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఓటాన్ అకౌంట్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేత పత్రంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
Latestnews, Telugunews, Amaravathi, Chandrababu Naidu, Finance Department…