Home తెలంగాణ ఆర్‌జీఓసీ, జవహర్ ఓపెన్ కాస్ట్ మైన్స్ ఫైవ్ స్టార్ అవార్డుకు ఎంపికయ్యాయి || RGOC, Jawahar Open Cast Mines selected for Five Star Award

ఆర్‌జీఓసీ, జవహర్ ఓపెన్ కాస్ట్ మైన్స్ ఫైవ్ స్టార్ అవార్డుకు ఎంపికయ్యాయి || RGOC, Jawahar Open Cast Mines selected for Five Star Award

0

 

Nsnnews// దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు కంపెనీ పరిధిలోని ప్రమాదరహిత గనులకు రెండు ఓపెన్ కాస్ట్ గనులు ఎంపికయ్యాయి. కేంద్రం ఇచ్చే ఫైవ్ స్టార్ అవార్డుకు రామగుండం-3 ఏరియాలోని RGOC,ఇల్లందు ఏరియాలోని జవహర్ ఓపెన్ కాస్ట్ గనులు ఎంపికయ్యాయి. దిల్లీలోజరిగిన కార్యక్రమంలో… కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ అవార్డును సింగరేణి సీఎండీ బలరాంకు ప్రధానం చేశారు. కోల్ ఇండియా, సింగరేణి, ఇతర ప్రైవేట్ కంపెనీల నుంచి 380 గనులు ఈ అవార్డు కోసం పోటీపడ్డాయి. గతేడాది సింగరేణికి చెందిన 2 భూగర్భ గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించగా… ఈ ఏడాది రెండు ఓపెన్ కాస్ట్ గనులు అవార్డుకు ఎంపిక కావటంపై CMD బలరాం సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ఓపెన్ కాస్ట్ , భూగర్భ గనులు ప్రమాదరహితంగా పనిచేసి… ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డుకు ఎంపిక కావాలని కాంక్షించారు.

latestnews, telugunews, telangananews….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version