Nsnnews// గూఢచర్యం ఆరోపణలపై… మాస్కోలోని ఆరుగురు బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించినట్టు రష్యా ప్రకటించింది. బ్రిటన్ రాయబార కార్యాలయంలోని ఆరుగురు దౌత్యవేత్తలు…రష్యాకు చెందిన సైనిక, పాలనాపరమైన రహస్య సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేస్తున్నట్లు తేలిందని మాస్కో అధికారులు తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ ఎంబసీ రాజకీయ విభాగానికి ఆధారాలు సమర్పించినట్టు చెప్పారు. రష్యన్ ఫెడరేషన్ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్టుగా భావించి…బ్రిటన్ కు చెందిన ఆరుగురు దౌత్యవేత్తల అక్రిడిటేషన్లు రద్దు చేసినట్టు మాస్కో అధికారులు తెలిపారు. బ్రిటన్ తో ఉన్న స్నేహపూర్వక సంబంధాల కారణంగా వారిపై కఠినచర్యలు తీసుకోకుండా…కేవలం బహిష్కరణ వేటు వేసినట్టు రష్యా అధికారులు చెప్పారు. గూఢచర్యంలో ఇతరుల ప్రమేయం ఉంటే…వారిపైనా చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.
Latestnews, Telugunews, Russia, British diplomats, Moscow, espionage charges…