Nsnnews// బోస్నియాలో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడ్డ ఘటనల కారణంగా నెరెత్వా నదిలో టన్నుల కొద్దీ చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ వరదల కారణంగా బోస్నియాలో 18 మంది మృతిచెందగా, అనేక మందికి గాయాలయ్యాయి. జబ్లానికా చుట్టుపక్కల ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. పర్వత ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ఆ శిథిలాలన్నీ కొట్టుకువచ్చి నదిలో భారీగా పేరుకుపోయాయి.
Latest news,Telugu news,Bosnia and Herzegovina news