Nsnnews// అల్లూరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు… GKవీధి, చింతపల్లి, సీలేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు..లైన్ మెన్లు, ఇతర సిబ్బంది సహకారంతో సరఫరాను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదకరమైన లోయల్ని దాటుకుంటూ చెట్లకు తగిలిన వైర్లను తొలగిస్తూ… విద్యుత్ సిబ్బంది ముందుకు సాగుతున్నారు. విద్యుత్ శాఖ పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు.
Latestnews, Telugunews, Alluri District, Heavy rains…