Nsnnews// ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుందని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ నిఖిత, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందూప్రియ, అధికారులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy District