Nsnnews// ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే…. కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన IVF చికిత్సను… సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఉచితంగా అందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తాను అధికారంలోకి వస్తే IVF చికిత్సకు సంబంధించిన… అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందనీ.. లేదా బీమా కంపెనీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని మిషిగన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. IVF చికిత్స అత్యంత ఖర్చుతో కూడుకుంటుంది. అమెరికాలో ఒక దఫాకు పదివేల డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ చికిత్స ఫలవంతమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నందున బహుళ దఫాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే IVF చికిత్సను ఎలా అమలు చేయనున్నారు? నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు.
Latest news,Telugu news,International news