Nsnnews// కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారిస్తున్నామని, అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు తెలపాలని వారిని ఆదేశించినట్లు జస్టిస్ పీసీ ఘోష్ మీడియాకు తెలిపారు. ‘‘జూన్ 25లోపు నివేదిక సమర్పించాలని ఇంజినీర్లందరికీ చెప్పాం. అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయి. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోంది. లోపం ఎక్కడుంది? ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తాం’’అని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు.
Latestnews, Telugunews Telangana, Kaleshwaram..