Nsnnews// ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా ఎదుగుతోందని.. ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలిపేందుకు.. అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో పాల్గొన్న మోడీ…ఉద్యోగాలు, నైపుణ్యం, సుస్థిరాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద వివిధ రంగాల్లో లక్షా 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. యువతకు ఇంటర్న్ షిప్ అందించేందుకు.. మెుదటి రోజు 111 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయని మోదీ తెలిపారు. త్వరలోనే మేడిన్ ఇండియా చిప్ లు ప్రపంచానికి ఎగుమతి చేయబోతుననట్లు వెల్లడించారు.
Latest news,Telugu news,National news