Nsnnews// కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద జరిపిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. UKG చదువుతున్న చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన.. వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని…విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వారు భారీ సంఖ్యలో ప్రవేశించి.. బీభత్సం సృష్టించారు. పాఠశాలపైకి రాళ్లు విసరడంతో పాటు…భవనంలోకి ప్రవేశించి కిటికీలు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజారాం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావమైన సీఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు..సిబ్బందిని చికిత్స కోసం ఆటోలో ఆసుపత్రికి తరలించారు.
Latest news,Telugu news,Kamareddy news,Crime news