Home Blog అక్రమ బెల్ట్ షాపు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి 5లీటర్ల విస్కీ స్వాధీనం.

అక్రమ బెల్ట్ షాపు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి 5లీటర్ల విస్కీ స్వాధీనం.

0
అక్రమ బెల్ట్ షాపు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి 5లీటర్ల విస్కీ స్వాధీనం.

 

NSN NEWS// SIDDIPET

చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో బూర కిషన్ తన ఇంటిలో ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమంగా బెల్ట్ షాపు నడుపుతున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, చిన్నకోడూర్ పోలీసులు కలసి రైడ్ చేసి 5.400 లీటర్ల విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకునీ చిన్నకోడూర్ పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ… ఇండ్లలో, హోటల్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, కిరాణా షాపులలో, ఇతర దుకాణాలలో ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడిపితే,బహిరంగ ప్రదేశంలో కానీ ఇళ్లల్లో గానీ పేకాట ఆడితే సమాచారం అందించాలని కోరారు. జూదం పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version