Nsnnews// సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మనుచౌదరి తనిఖీచేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. పిల్లలు ఆరోగ్యంగా, చురుగ్గా ఎదగాలంటే మెనూ ప్రకారం పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. అంగన్వాడీ భవనం చుట్టూ కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనదని పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు పాడుతూ డ్యాన్స్ చేసిన రైమ్స్ ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట సంక్షేమశాఖ అధికారి ఎల్లయ్య, సీడీపీఓ రమాదేవి, కొండపాక తహశీల్దార్ దిలీప్ తదితరులున్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news